వెన్నుపోటు పొడిచిన వారిని వదిలేది లేదు..బీద మస్తాన్ రావు
వైసీపీ నీడలో అభివృద్ధి చెంది తిరిగి ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఉండడం చాలా బాధాకరమని.. అటువంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ బీద మస్తాన్ రావు కోరారు. కోవూరు లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బీద తన మనసులోని భావాలను వ్యక్తీకరించారు. ఈసారి నెల్లూరులో విజయ్ సాయి రెడ్డిని గెలిపించడమే సీఎం జగన్ కు ప్రజలు ఇచ్చే కానుక అని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ప్రగతి పథంలో నడవాలి అంటే విజయ్ సాయి రెడ్డిని గెలిపించుకోవాలి అని ఆయన అన్నారు. ఈసారి కూడా జగన్ సీఎం కావడం ఖాయం అన్న బీద.. 175 కు 175 వైసీపీ కే వస్తాయి అని జోస్యం చెప్పారు. ప్రస్తుతం నెల్లూరుని తమ కంచుకోటగా మార్చుకోవడానికి వైసీపీ ఎత్తుల పై ఎత్తులు వేస్తోంది. ఇవి ఎంతవరకు ఫలిస్తాయి అన్నది ఫలితాలు వస్తేనే తేలుతుంది.













