త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు
వెనుకబడిన సామాజికవర్గాలకు అన్యాయం జరిగితే పార్టీలకతీతంగా స్పందిస్తామని బీసీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని విదేశీయులకు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించేందుకు కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. చట్టసభలు, నామినెటేడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ బీసీలకు సరైన న్యాయం జరగడంలేదన్నారు.













