తుళ్ళూరులో కూడా క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు – బాలకృష్ణ
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్లోని తుళ్ళూరులో కూడా ఏర్పాటు చేయనున్నట్లు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లో విరాళాల సేకరణార్థం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెదేపా ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు విందు కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన రూ.81,77,550 తెదేపా ఆస్ట్రేలియా విభాగం బసవతారకం క్యాన్సర్ వైద్యశాలకు అందజేసింది. మే నెల 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందఠంగా ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో క్యాన్సర్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా బాలకృష్ణ వెల్లడించారు. విభాగం అధ్యక్షుడు యెనికపాటి వెంకటేష్ మాట్లాడుతూ బాలకృష్ణ చేస్తున్న మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం అదష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.













