BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu ) కు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. కరీంనగర్ (Karimnagar) టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని అందులో విజ్ఞప్తి చేశారు. 2023లోనే కరీంనగర్లో టీటీడీ (TTD) ఆలయానికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2023 మే 31న కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో భూమి పూజ (Bhoomi Pooja) జరిగింది. రెండేళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆలయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపించండి అని బండి సంజయ్ కోరారు.













