ఈ నెల 21న అమరావతికి బండి సంజయ్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నెల 21న అమరావతికి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను పార్టీ అధిష్ఠానం బండి సంజయ్కు అప్పగించింది. అయితే బండి సంజయ్ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.













