మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు : బాలినేని
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటారని ఆయన తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రితో చెప్పానని మంత్రి బాలినేని పేర్కొన్నారు. మంత్రి పదవి పోయినా నేను భయపడనని అన్నారు. నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినపుడు తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయం దగ్గర పడుతుండడంతో మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది పదవులను ఆశిస్తున్నారు.













