వారాహి యాత్రకు పూర్తి మద్దతు : బాలకృష్ణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. నంద్యాలలో పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారు అని ఆరోపించారు.













