టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన
ఎన్టీఆర్ తనయుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ లను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనేదే ఎన్టీఆర్ ఆశయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గతంలో ఉన్న క్యాంటీన్ల ఏర్పాటయ్యాయని తెలిపారు. రాజకీయ ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీనను రద్దు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దాని ప్రభావమే ప్రజలపై పన్నుల బాదుడే బాదుడు అని ఆరోపించారు.













