వారి రక్షణ కోసం కఠిన చట్టాలు : బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో పాత్రికేయులపై వైసీపీ కార్యకర్తల దాడిని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరిగాయని, వారి రక్షణ కోసం కఠిన చర్యలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు ఎంతో దూరం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.













