Balakrishna: పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా : బాలకృష్ణ

గతంలో పులివెందుల (Pulivendula) ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు (Elections) జరిగాయన్నారు. పులివెందుల ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును ధైర్యంగా వినియోగించుకున్నారన్నారు. గతంతో నామినేషన్ (Nomination) వేయడానికి నాయకులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. ఈసారి మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని తెలిపారు.