Nara Lokesh: వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటాం : మంత్రి లోకేశ్
వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Venna Balakotireddy) కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)ను కలిశారు. బాలకోటిరెడ్డి కుటుంబాని కి జీవితాంతం అండగా ఉంటానని లోకేశ్ భరోసా ఇచ్చారు. కార్యకర్తల బాధ్యత తీసుకుంటూ, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హత్య ఘటన పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ (Nagendramma )ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ వాకబు చేశారు.
హత్యకేసులో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు (Housing bills) పెండిరగ్లో ఉండటంతో పాటు, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టు (House mortgage) లో ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ ధైర్యం చెప్పారు.













