తిరుమలలో వైభవంగా బాగ్ సవారి
తిరుమలలో బాగ్ సవారి ఉత్సవం వైభవంగా సాగింది. సాధారణంగా అన్ని ఉత్సవాలు, సేవలు, ఊరేగింపుల్లో ఉత్సవర్లు ఆలయానికి ప్రదక్షిణంగానే ఊరేగుతారు. బ్రహ్మూెత్సవాలు ముగిసిన మరుసటి రోజు మాత్రమే మలయప్ప ఆలయానికి, పుష్కరిణీకి అప్రదక్షిణగా ఊరేగుతారు. ఇందులో భాగంగా మలయప్ప అనంతాళ్వారుల తోటకు వెళ్లి అక్కడ పూజా నివేదనలు అందుకున్నారు. అనంతాళ్వారు సమాధి వద్ద పుష్పమాల, శఠారి మర్యాదలు అందుకుని అప్రదక్షిణగానే మలయప్ప ఆలయానికి చేరుకున్నారు. శ్రీ స్వామి, అనంతాళ్వారుల మధ్య జరిగిన పురాణగాధకు నిదర్శనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ.













