ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ కోరగా తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.













