ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పని దినాల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శాసన సభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12న తేదీన 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచనున్నారు. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించారు.













