ఇది అందరికి తెలిసిన విషయమే : అయ్యన్న
ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేశారో అందరికి తెలుసునని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి చేయలేదు సరే, అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. హుద్ హుద్ తుపాన్ వస్తే చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరం చూశామన్నారు. వైసీపీ నేతలు ఆంధ్రా యూనివర్సిటీని బ్రోతల్ హౌస్‌గా మార్చారని, వీసా ఛాంబర్‌ను పార్టీ ఆఫీసుగా మార్చలేదా? అని నిలదీశారు.
ఏ2 విజయసాయిరెడ్డి పెద్ద దొంగని, రూ.10వేల కోట్ల ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. విజయసాయి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఎంత దోచుకున్నారో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వీళ్లా మనకు నీతులు చెప్పేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.













