టీడీపీ కోసం ప్రాణాలు వదిలేందుకూ తాను సిద్ధం
తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు వదిలేందుకు కూడా తాను సిద్ధమని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ విశాఖలో వైసీపీ నేతలు రౌడీలను పెట్టి భూములు ఆక్రమించారని, నగరంలో సుమారు 75 వేల కోట్ల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. దేశంలో తక్కువ ధరకు ఫైబర్ నెట్ ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ అని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.149లకు ఫైబర్ నెట్ సదుపాయాన్ని కలిస్తే, ఇప్పుడు రూ.450కు పెంచారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అన్నారు. 9.6 శాతం వడ్డీకి 25 ఏళ్లు తనఖా పెట్టి మద్యం అమ్మకాల మీద అప్పు తెచ్చారని ఆరోపించారు. ఆ ఆప్పు ఎవరు తీరుస్తారని ప్రవ్నించారు. తనపై ఇప్పటికి 15 కేసులు పెట్టారని, ఇంకో కేసు కూడా పెడతారంటు అని వ్యాఖ్యానించారు.













