రామ మందిరం ప్రారంభోత్సవానికి.. హోమ్ మంత్రి వనితకు ఆహ్వానం
అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను, ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితకు అందజేశారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో రమణ మూర్తి ఆధ్యర్యంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం బృందం ఆమెకు అందించారు. అనంతర ంహోమంత్రికి వేదాశ్సీస్సులు ఇచ్చి శేష వస్త్రంతో సత్కరించారు. తానేటి వనతి భవిష్యత్లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతా మంచే జరగాలని వేద పండితుల బృందం ఆశీర్వదించింది. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందండం చాలా సంతోషంగా ఉందన్నారు.













