Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది

విజయవాడ సీబీఐ కోర్టులో ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు అందాయని అయేషా మీరా (Ayesha Meera) తల్లి షంషాద్ బేగం (Shamshad Begum) తెలిపారు. తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా, విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ కేసులో సత్యంబాబు (Satyam Babu) నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. మళ్లీ సత్యంబాబుపై కేసు పెట్టి తమను అభిప్రాయం అడగటమేంటని ప్రశ్నించారు. కేసు విచారణ ముగిసిందని జూన్‌లోనే సీబీఐ సీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు ఇచ్చింది. రిపోర్టు కాపీలను కూడా మాకు ఇవ్వకుండా కేసు గురించి అభిప్రాయం చెప్పాలంటే ఎలా? స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సీబీఐ (CBI) కూడా మా బిడ్డకు న్యాయం చేయకలేకపోయింది. మత సంప్రదాయాలను పక్కనపెట్టి ఆయేషా మీరా రీ పోస్టుమార్టానికి సహకరించాం. కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి (Chief Minister), ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ స్పందించాలి అని షంషాద్ బేగం తెలిపారు.