షర్మిల మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయి..అవినాష్ రెడ్డి
కాంగ్రెస్ తరఫున ప్రచారం మొదలు పెట్టిన షర్మిల వివేకా హంతకుడికి ఓటు వేయద్దు అంటూ అవినాష్ రెడ్డి గురించి డైరెక్ట్ గా కామెంట్ చేస్తుంది. అయితే తాజాగా షర్మిల కామెంట్స్ పై అవినాష్ రెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి ఎంతో భయంకరంగా ఉన్నాయని.. అలా షర్మిల మాట్లాడుతుందని తాను ఎక్స్పెక్ట్ చేయలేదని అవినాష్ అన్నారు. ఆమె మాట్లాడే మాటలు ఆమె విజ్ఞతకే వదిలేస్తాను అని అతను పేర్కొన్నారు. మసి పూసినా.. బురద చల్లినా.. అది వాళ్ల ఇష్టం.. ఎవరికి తగినట్లు వారు మాట్లాడుతుంటారు.. వాళ్ల మాట్లాడే మాటలు వారి విచక్షణకే వదిలేస్తున్నాను అని అవినాష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు షర్మిల మాటల గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదని అవినాష్ స్పష్టం చేశారు. ఎవరు ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు.. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. కానీ మనిషిగా పుట్టిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు కాస్త విచక్షణతో మాట్లాడితే బాగుంటుంది అంటూ అవినాష్ అన్నారు.













