టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవో (పూర్తి అదనపు బాధ్యతలు)గా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా ఉన్నారు. ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పూర్వపు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా ఏవీ ధర్మారెడ్డి చేత తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనిల్‌కుమార్ సింఘాల్, నూతన ఈవో, అధికారులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనిల్ కుమార్ సింఘాల్‌కు ఈవో ధర్మారెడ్డి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, బోర్డుసెల్ డిప్యూటీ ఈవో సుధారాణి పాల్గొన్నారు.













