ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అటానమస్ కళాశాలల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కళాశాల్లో వినియోగించాలని సూచించారు. నాన్ అటానమస్ కళాశాలలకూ ఇవే ప్రశ్నపత్రాలు ఉంటాయాన్నారు. పేపర్ వాల్యుయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యార్థి డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని అన్నారు. నైపుణ్యం లేకుంటే ముఖాముఖి పరీక్ష కూడా ఎదుర్కోలేమని తెలిపారు.













