రాజధాని నిర్మాణానికి ఆటో డ్రైవర్ల విరాళం
రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు సాయంగా ఆటోడ్రైవర్లు విరాళం అందించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి 1.35 లక్షల రూపాయలను అందజేశారు. రోడ్డు ట్యాక్స్ ఎత్తివేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా టీడీపీ సెల్ అధ్యక్షుడు వాసం మునియ్య లక్షా నూటపదహారు రూపాయలను, తిరువూరుకు చెందిన ఆటోడ్రైవర్లు ఉమా మహేశ్వర రావు 10 వేల రూపాయలు, యండ్రాతి కిరణ్కుమార్ 5 వేల రూపాయలు, అడుసుమిల్లి బసవయ్య 20 వేల రూపాయలు అందచేశారు. తాము కష్టపడి సంపాయించిన దాంట్లో పొదుపు చేసి రాజధాని నిర్మాణానికి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.













