సీఎం వైఎస్ జగన్ తో ఆస్ట్రేలియా ఎంపీల బృందం భేటీ
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. వారంతా అక్కడి లేబర్‌పార్టీ సభ్యులు. ఇంధన, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రెండు రాష్ట్రాలు పరస్పరం కలసి పని చేసేందుకున్న అవకాశాలపై ఆ బృందం చర్చించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. చర్చలు సానుకూల వాతావరణంలో జరగడంపై బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. విద్యారంగానికి సంబంధించిన విధానాల్లో రెండు రాష్ట్రాల మధ్య సారూప్యతలున్నాయి. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన లక్ష్యాల సాధనకు రెండు ప్రభుత్వాల పరస్పర సహకారంపై చర్చించాం. ఇంధన, రంగం, ముఖ్యంగా పునరుత్పాదక ఇందన వనరులపై చర్చింఆం. పవన్, సౌర విద్యుత్ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది అని విక్టోరియా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రభుత్వ విప్ లీ తర్లామిస్ పేర్కొన్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది..













