సీఎం జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని అన్నారు. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూర ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినప్పుడు సృష్టంగా కనిపించిందని అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.













