Minister Atchannaidu: ప్రైవేటు వ్యాపారుల కంటే మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి యూరియా పంపిణీ చేశారు. ఎరువుల వినియోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏ ఒక్క రైతు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అధికారుల సూచనతో వాడాలన్నారు. ప్రైవేటు వ్యాపారుల కంటే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు ఎక్కువగా ఇస్తున్నట్లు వివరించారు. రైతులు ఆందోళన చెంది మొత్తం యూరియా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రబీ పంటకు ఇప్పటికే ఎరువులు కేటాయించిందని తెలిపారు.