ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అప్పుడే.. స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు..
నిన్నటి వరకు తమ కూటమి పై విమర్శలు చేసిన వైకాపా..తాము అభ్యర్థుల్ని ప్రకటించాక వణికి పోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనలో ఈ రాష్ట్రం దారుణమైన పరిస్థితికి చేరుకుందని ఆయన విమర్శించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ తో కలిసి మీడియాతో ముచ్చటించిన అచ్చెన్నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడారు. ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో తమ బహిరంగ సభకు బస్సులు కేటాయించాల్సిందిగా ఆర్టీసీ ఎండిని ఆయన డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవలసి వస్తుంది అని హెచ్చరించారు. అంతేకాకుండా జనసేన టిడిపి కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువైపోతున్నాయని ఇకనైనా అవి తగ్గించుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. 17న జరగనున్న ఈ భారీ బహిరంగ సభలోని తమ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తాం అని ఆయన తెలిపారు.













