టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ?
తెలుగుదేశం పార్టీ రధసారథిగా ఇక కింజరావు అచ్చెన్నాయుడు వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్యక్షుడిగా వ్యవహరిస్తున్న కళా వెంకటరావు స్థానంలో అచ్చెన్నాయుడుకు అవకాశం కల్పించే దిశగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడిపోకుండా నిలబెట్టి నడిపించే సమర్ధుడైన నాయకుడు అచ్చెన్నాయుడనే భావనకు అత్యధికులు బలం చేకూర్చుడంతో చంద్రబాబు నాయుడు అధిక శాతం అచ్చెన్నాయడు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చంద్రబాబు త్వరలోనే చేస్తారని కూడా అంటున్నారు.













