PVN Madhav: సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన: మాధవ్
అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వాజ్పేయి (Vajpayee) విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమని అన్నారు. వాజ్పేయి గొప్పతనం తెలుసుకుని అందరూ ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సుపరిపాలన యాత్ర గురించి సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు చెప్పిన వెంటనే ఆనందం వెలిబుచ్చారని తెలిపారు. ఈ యాత్రకు కూటమిపరంగా, ప్రభుత్వపరంగా సహకారం అందించారని చెప్పారు.
ఈ యత్రలు, సభల్లో కూటమి పార్టీల నేతలను భాగస్వామ్యం చేశారన్నారు. అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్లకు నాడు వాజ్పేయి సహకారం అందించారని గుర్తుచేశారు. సుపరిపాలన యాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారన్నారు. వాజ్పేయి ఈ దేశానికి చేసిన సేవకు, త్యాగాలను గురించి అందరూ ముక్త కంఠంతో కీర్తిస్తున్నారని తెలిపారు. ఈనెల 25న వాజ్పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతి వనం, విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.






