వీటో చేసే అధికారం మండలికి లేదు : తమ్మినేని
శాసనసభ అనేది ప్రజల సభ, శాసనమండలి కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే అని ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు నిలిచిపోయిన నేపథ్యంలో స్పీకర్ మాట్లాడారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని తమ్మినేని మరోసారి సృష్టం చేశారు. శాసనసభలో చర్చించి, ఆమోదించిన బిల్లులను ఎగువసభకు పంపించాం. వాటిపై సూచనలు చేసే అవసరం ఉంటే శాసనసభకు సూచించొచ్చు. కానీ ఏకంగా బిల్లును వీటో చేసే అధికారం మండలికి లేదు. ఇచ్చిన గౌరవాన్ని పెద్దల సభ నిలబెట్టుకోలేకపోతోంది. ఇప్పటికైనా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని ఆవిస్తున్నాం అని స్పీకర్ అన్నారు.













