అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల హైలైట్స్ ఇవే..
ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలతో సహా శాసనమండలి సమావేశాలు కూడా శుక్రవారం నాటికి నిరవధికంగా వాయిదా పడ్డాయి. సుమారు 11 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో రెండు రోజులు ఇచ్చిన సెలవులు తీస్తే నికరంగా తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నవంబర్ 11న ప్రారంభమైన ఈ సమావేశాలు 22 వరకు కొనసాగాయి. ఇక ఈ సమావేశాలకు సంబంధించిన హైలైట్లు ఏమిటో తెలుసుకుందాం.. మొత్తానికి నవంబర్ 11న ప్రారంభమైన ఉభయ సభలలో కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 1.8 లక్షల కోట్ల రూపాయలతో రాబోయే నాలుగు మాసాల కాలానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈసారి సమావేశాలకు హైలైట్ గా నిలుస్తుంది. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం వైసీపీ నేతలు సభకు చర్చకు రావాల్సిందిగా కూటమి నేతలు కోరుకున్నారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం ప్రకారం ఎవ్వరూ సభకు రాకుండా సైలెంట్ గా ఉండిపోయారు.
కానీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వం తమపై వేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మండల సమావేశాల విషయానికి వస్తే 20 ఒక్క కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ నేతలు హాజరు కావడంతో సుదీర్ఘ చర్చలు, విమర్శలు, వాకౌట్లు పరిపాటిగా మారాయి. ఈ సభలలో ఉప సభాపతి ఎంపిక జరగడం విశేషం. ఉండి ఎమ్మెల్యే అయిన కనుమూరి రఘురామకృష్ణరాజును ఉపసభాపతిగా ఎంపిక చేశారు.
మొత్తానికి మండలి సమావేశాలలో 60 గంటల పాటు పనిచేసినట్లు ప్రకటించిన సచివాలయం మొత్తం 75 ప్రశ్నలకు గాను సభ్యులు సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. మండలి సమావేశాలలో చర్చలు మంటలు రేపాయి. ఇక ఈ సమావేశాలలో మహిళా భద్రతపై ఎక్కువగా చర్చలు జరిగాయి. అలాగే ప్రస్తుతం ఆంధ్రలో హల్చల్ రేపుతున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా విస్తృతంగా చర్చించారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సభకు రాకపోయినా సరే.. అటు అసెంబ్లీ, ఇటు మండలి సమావేశాలలో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమే. ఆయన సభకు రావాలి అంటూ సమావేశాలలో కోరుకొని నేత లేరు అని చెప్పవచ్చు.













