ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే
శాసనసభను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారి తీసింది తప్పితే, సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడలేదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను దహనం చేసినట్లు తెలిపారు. నేడు శాసనసభ సమావేశాల చిట్టచివరి రోజు. సభను ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కోరం లేకపోవడం సభను 9:15 వాయిదా వేశారు. 2 గంటలైనా మళ్లీ సమావేశపరచలేదు. యాత్ర`2 సినిమా విడుదలవుతోందని అసెంబ్లీని వాయిదా వేవారు. అందుకే మేం నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చాం అని అన్నారు.













