Ashok Gajapathi Raju : ఎంపీ కలిశెట్టికి అశోక్ గజపతిరాజు అపురూప బహుమతి
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి (Kalisetti Appalanayuda) తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అపురూప బహుమతి ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు కార్యకర్తలు తనకు ఇచ్చిన ఓ సైకిల్ (Bicycle) ను ఆయన ఎంపీకి బహూకరించారు. పార్లమెంటుకు ఎంపీ కలిశెట్టి సైకిల్‌పై వెళ్లి వస్తుంటారన్న విషయం తెలిసిందే. పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పేందుకు పసుపు రంగు సైకిల్‌తో సమావేశాలకు హాజరవుతారాయన. స్థానికంగానూ తిరిగేందుకు వీలుగా ఈ సైకిల్‌ను అందించారు. అప్పట్లో మన్యంతో పాటు చీపురుపల్లి (Cheepurupalli) ప్రాంతాల్లో ఈ సైకిల్‌పైనే అశోక్ గజపతిరాజు యాత్ర చేపట్టారు. ఏటా దసరా (Dussehra) రోజు తప్పనిసరిగా తొక్కేవారు. రెండు రోజుల కిందట జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో తనకు ఆ సైకిల్‌ను బహుమతిగా అందించారని ఎంపీ కలిశెట్టి తెలిపారు.













