Chandrababu: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన చంద్రబాబు..!
సంక్షోభాలను ఎదుర్కోవడంలో చంద్రబాబు (Chandrababu) సిద్ధహస్తుడు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిపై తొందరపడకుండా తగిన సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. తనకు అనుకూల పరిణామాలు రాగానే ఠక్కున చక్కబెట్టేసుకుంటారు. అందుకే చంద్రబాబును చాణక్యుడిగా పోల్చుతుంటారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీని (TDP) సమర్థవంతంగా నడిపించగలుగుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో (NDA Alliance) కీలగ భాగస్వామిగా ఉన్నారు. మిగిలిన ఏ పార్టీ అధినేతకూ లేని గుర్తింపు చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీ (BJP) ఇస్తోంది. చంద్రబాబుకు బీజేపీ ఎందుకంత ప్రయారిటీ ఇస్తోంది.?
2014-2018 మధ్య బీజేపీతో కలిసి పనిచేశారు చంద్రబాబు. అయితే ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో వైరం పెట్టుకుని కూటమి నుంచి బయటికొచ్చేశారు. 2019లో దారుణంగా ఓడిపోయారు. దీంతో చంద్రబాబు పనైపోయిందనుకున్నారు. బీజేపీతో స్నేహం కోసం చంద్రబాబు చాలా గట్టిగా ట్రై చేశారు. కానీ మోదీ (Modi), షా (Amit Shah) అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా చంద్రబాబు ఓర్పుతో ఉన్న్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ (TDP), జనసేనతో (Janasena) బీజేపీ కలవదనే అందరూ అనుకున్నారు. అయితే మూడు రోజులపాటు ఢిల్లీలో తిష్టవేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. బీజేపీని కలుపుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలు బాగానే పనిచేశాయి. మేనిఫెస్టో (Manifesto) విడుదల సమయంలో టీడీపీ మేనిఫెస్టోను పట్టుకునేందుకు కూడా బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఎన్నికల ఫలితాలు (2024 election results) వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ (majority) మార్క్ రాలేదు. దీంతో టీడీపీపైన ఆధారపడాల్సి వచ్చింది. అందుకే చంద్రబాబుపై బీజేపీకి ప్రేమ పొంగుకొచ్చేసింది. ప్రతి కీలక సమావేశానికి చంద్రబాబును ఆహ్వానిస్తున్నారు. ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన మాటకు విలువ ఇచ్చి అడిగినవి నెరవేరుస్తున్నారు.
తాజాగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ (Haryana CM Nayab Singh Saini) ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పంపింది బీజేపీ. ఈ స్టేజ్ పైన చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పొచ్చు. చంద్రబాబు స్టేజ్ పైకి వెళ్లగాని బీజేపీ నేతలు లేచి నిలబడి స్వాగతం పలికారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తన సీటును ఖాళీ చేసి చంద్రబాబుకు ఇచ్చారు. అమిత్ షా పక్కనే చంద్రబాబు ఆసీనులయ్యారు. అమిత్ షా – చంద్రబాబు ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో (social media) హల్చల్ చేస్తున్నాయి. మీడియా కూడా చంద్రబాబుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు చంద్రబాబును కలిసేందుకు కూడా ఇష్టపడని బీజేపీ నేతలు ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతున్నారు. దీన్ని చూసిన టీడీపీ అభిమానులు బాబు ఎక్కడున్నా బాబే అనుకుంటున్నారు.













