Chandra Babu: జూన్‌లో కూటమి సర్కార్ కు అగ్ని పరీక్ష..మరి బాబు ఏం చేస్తారో?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న వేళ, ప్రజలలో కొత్త ఆశలు మేల్కొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu)నాయకత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేలా, అందరికి లబ్ధి చేకూరేలా పథకాల రూపకల్పనలో ప్రభుత్వం నిశ్చితంగా ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే జూన్ నెలలో మూడు కీలక పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెలే విద్యాసంవత్సరం (Academic year) ప్రారంభమవుతుంది, అలాగే ఖరీఫ్ (Karif) సాగు కూడా మొదలవుతుంది. రైతులకు ఇది ఖర్చుల కాలం. వ్యవసాయానికి పెట్టుబడులు అవసరం, అప్పుల కోసం వారు తడుముకోవాల్సిన పరిస్థితి లేకుండా చేసేందుకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్ సమ్మాన్ (Kisan Saman) నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాయం రైతులకు నిజంగా ఊరటను కలిగించనుంది. ఇక విద్యార్థుల తల్లులకూ ముఖ్యమంత్రి సాయం అందించనున్నాడు. తల్లికి వందనం (Thalliki Vandanam) పథకం ద్వారా పిల్లల చదువులకు అవసరమైన ఖర్చుల భారం తక్కువ అవుతుంది. తల్లిదండ్రుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 18 ఏళ్ల లోపు మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం కూడా ఇచ్చే ఆలోచనలో కూటమి ఉంది. ఈ మూడు పథకాలను ఒకేసారి అమలు చేస్తే, ప్రతి ఇంటిలోనూ నగదు ప్రవాహం కనిపించే అవకాశం ఉంది.
ఇదంతా చూస్తే ప్రజలు ప్రభుత్వాన్ని భగవంతుడిగా భావించడం సహజం. గతంలో కూడా ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి నాయకులను ప్రజలు తమ దేవుళ్లుగా కొలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబుపై కూడా అదే స్థాయిలో ఆశలు నెలకొన్నాయి. వాస్తవానికి పాలకులు ప్రజల కష్టాల్లో భాగస్వాములై, వారికి మార్గం చూపిస్తే ఆరాధనకు కారణం అవుతారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న సంకేతాలు జూన్ నెల నాటికి స్పష్టమవుతున్నాయి.
ఇక ఎన్నికల ముందు హామీగా చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో మూడు ఈ నెలలోనే అమలు కావడంతో, ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నట్టే. వైసీపీ పాలనలో పథకాలు తరచూ అమలై ప్రజలకు నిరంతరంగా డబ్బు అందుతూ ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే బాటలో ముందుకు వెళ్లడమే కాకుండా, మరింతగా ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. జూన్ నెలలో ప్రభుత్వ ఖాతా నుంచి వచ్చే నిధులు సామాన్యుడి చేతిలోకి చేరితే, “బాబే మా దేవుడు” అనే మాటలు వినిపించడం ఆశ్చర్యం కాదు. అయితే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ సజావుగా జరిగేలా చూడడం నిజంగా కూటానికి అగ్నిపరీక్ష లాంటిది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా దీన్ని నెట్టుకొస్తారో చూడాలి..