Allu Arjun : తగ్గేదేలే.. మెగా ఫ్యామిలీతో కయ్యానికే సిద్ధమైన అల్లు అర్జున్..!?
అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కారణాలు అందరికీ తెలిసినవే. జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. వైసీపీని (YCP) ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి (Silpa Ravichandra Reddy) మద్దతు తెలిపారు. వైసీపీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీకి అభ్యర్థికి మద్దతివ్వడం, జనసేనకు అనుకూలంగా మాట్లాడకపోవడంతో అల్లు అర్జున్ అటువైపే ఉన్నాడని జనసైనికులు, మెగా అభిమానులు (Mega Fans) క్లారిటీకి వచ్చేశారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇరు ప్రయత్నాలు ప్రయత్నిస్తాయని.. కచ్చితంగా అది టీ కప్పులో తుపాను లాంటిదని అందరూ అనుకున్నారు. అయితే పుష్ప 2 (Pushpa 2) మూవీ రిలీజ్ అయ్యాక ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సే లేదని తేటతెల్లమైపోయింది.
పుష్ప 2 సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇండియన్ సినిమా రికార్డులన్నీ పుష్ప 2 బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా చుట్టూ రాజకీయ రంగులు పులుముకున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్కడా మెగా ఫ్యామిలీ పేరు తీసుకురాలేదు. ఆ కుటుంబ అండతో ఎదిగి ఇప్పుడు వాళ్లను విస్మరించడాన్ని మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాను తాము బహిష్కరిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు జనసైనికులు కూడా ఇదే విధంగా కేడర్ కు పిలుపునిచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ కు తాము అండగా ఉంటామంటూ వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు.
వాస్తవానికి సినిమా రిలీజ్ సమయానికి అన్నీ సెట్ అవుతాయనుకున్నారు. అయితే అలాంటివేమీ జరగకపోగా మరింత ముదిరినట్లు అర్థమవుతోంది. సినిమాలో ఓ డైలాగ్ కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే పెట్టారనే టాక్ నడుస్తోంది. “ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అనే ఓ డైలాగ్ ఉంది. ఇది చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే సినిమాలో పెట్టారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాక.. ఈ సినిమా ప్రివ్యూ షోకి శిల్ప రవిచంద్రా రెడ్డి కూడా వచ్చారు. దీంతో వీళ్ల మధ్య బంధం మరింత బలపడిందని అర్థమవుతోంది.
వాస్తవానికి ఉప్పు – నిప్పులా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాల జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే అల్లు అర్జున్ కి బాగుండేది. అయితే వివాదాస్పద డైలాగ్స్ పెట్టడం, శిల్ప రవిచంద్రారెడ్డి వచ్చి తనతోపాటు సినిమా చూడడం లాంటివి మరింత అగ్గి రాజేశాయి. ఎవరు ఎన్ని అనుకున్నా తాను శిల్ప వెంటే ఉంటానని అల్లు అర్జున్ ఇప్పుడు తేల్చేశారు. అంతేకాక.. మెగా ఫ్యామిలీతో తగ్గేదేలా అన్నట్టు సంకేతాలిచ్చారు. కాబట్టి ఇకపై ఈ రెండు ఫ్యామిలీల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నాగబాబు (Nagababu) మెగా అభిమానులంతా ఎవరి సినిమాలనైనా ఆదరించాలని ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ యాటిట్యూడ్ సానుకూలంగా లేదు. కాబట్టి ఈ వివాదం మరింత ముదరడమే తప్ప తగ్గేలా లేదు.













