RRR: ఎవడ్ని వదలను.. రఘురామ స్ట్రాంగ్ వార్నింగ్…!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) తనను చిత్రహింసలు చేసిన వారి విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండటంతో ఒక్కొక్కరు జైలుకు వెళుతున్నారు. అరెస్ట్ ల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసిన వారు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన… గుడివాడ నియోజకవర్గానికి చెందిన కామేపల్లి తులసి బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం ఆయనను విచారణకు పిలిచిన పోలీసులు అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకుని గుంటూరు జైలుకు తరలించారు. త్వరలోనే డాక్టర్ ప్రభావతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ కేసులో ఉన్న నిందితులు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సరే కోర్టు నిరాకరిస్తూ వస్తోంది. తాజాగా దీనిపై రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చిత్రహింసల గురి చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లడం ఖాయమని సునీల్ కుమార్, ఆంజనేయులు, వైయస్ జగన్ (Ys Jagan) కచ్చితంగా జైలుకు వెళతారని పేర్కొన్నారు. ఇప్పటికే విజయపాల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని… త్వరలో డాక్టర్ ప్రభావతి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తన గుండెలపై కూర్చుని టార్చర్ పెట్టిన తులసి బాబు తప్పించుకోలేడని పేర్కొన్నారు. తిరుపతి తొక్కేసులాట బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తని.. తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా క్షమాపణ చెప్పారన్నారు. అందుకు గానూ.. బిఆర్ నాయుడు తీరుని అభినందిస్తున్నానన్నారు. బి ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయ్యాక సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొనియాడారు.













