ఏపీ నుంచి అమెరికా పౌరుల్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
లాక్‌డౌన్‌తో అమెరికాకు తిరిగి వెళ్లే అవకాశం లేక ఆంధప్రదేశ్‌లో ఉండిపోయిన ఆ దేశ పౌరుల్ని (ప్రవాస భారతీయులు) అమెరికాకు తీసుకెళ్లేందుకు యూఎస్ కాన్సులేట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఆంధప్రదేశ్ నుంచి 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వీరందర్ని కాన్సులేట్ అధికారులు గురువారం విజయవాడకు రప్పించారు. ఇక్కడి నుంచి నాలుగు బస్సుల్లో హైదరాబాద్ తీసుకెళ్లారు. బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా కూర్చొబెట్టారు. వీరందర్నీ శుక్రవారం ముంబయికి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు తీసుకెళ్లనున్నారు.













