వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి స్వరం సిద్ధం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తోంది. ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదుట మైదానంలో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. సమావేశ ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రులు పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాటు కోసం 20 కమిటీలను సీఎం జగన్ నియమించారు. గ్రామ వార్డు సభ్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ పేరు పేరునా అందరికీ సీఎం లేఖలు పంపారు. తొలి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్లీనరీలో చర్చించనున్నారు.













