గిడ్డంగుల సంస్థ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 70 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26.01. 2019 న విజయవాడ లో గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధి గా సంస్థ చైర్మన్ యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా చైర్మన్ ప్రసాద్ మహాత్మగాందీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండా ఎగురవేసి రాష్ర ప్రజలందరికి 70 వ గణతంత్ర దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొంత గోదాములు 6 లక్షలు మెట్రిక్ టన్నుల ఉండగా నాబార్డు సాయంతో రూ. 228 కోట్లతో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ సొంత నిధులతో 1 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 5 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి కాకుండా ఇన్వెష్టర్, ప్రయివేటు 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వచ్చే సంవత్సరం 2020 నాటికి 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అందుబాటులోకి రానున్నాయి.
దీనిలో భాగంగానే రేపు విశాఖపట్నం జిల్లా లోని పరవాడ మండలం లోని పి.ఎస్. బోనంగి లో 10 వేల మెట్రిక్ టన్నుల గోదాములను ప్రారంభిస్తామని ప్రసాద్ తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇప్పటి వరకు సంస్థ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు ను 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచడం జరిగింది. నాబార్డు సాయంతో రూ. 228 కోట్లతో నిర్మిచుచున్న గోదాములకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది. సంస్థ నిర్మిస్తున్న గోదాములకు భూములను ప్రభుత్వం 30 సంవత్సరాలు ఉచితంగా లీజు ఇవ్వడం సంస్థ చరిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రసాద్ చెప్పారు. ఆంద్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ను ఆహార ధాన్యాల ఉత్పత్తి కి నోడల్ ఏజన్సీ గా ప్రభుత్వం ఉత్త్వర్వులు ఇవ్వడం వలన సంస్థ మరింత ఆర్థికాభివుద్ది చెందుతుందని ప్రసాద్ తెలిపారు.
గుంటూరు జిల్లా లోని యడ్లపాడు లో ఉన్న స్పైసెస్ పార్కు లో రూ. 50 కోట్ల తో 13 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించిన 2 యూనిట్ల మిర్చి, పసుపు కోల్డ్ స్టోరేజ్ లను 1 యూనిట్ పిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని, మరొకటి మార్చి లో ప్రారంభిస్తామని ప్రసాద్ చెప్పారు.అలాగే ఎండి శ్రీ కె.వి.సత్యనారాయణ ఐఎఎస్ బాగా పని చేస్తున్నారని, సంస్థ అభివృద్ధికి నూతన సంస్కరణలు చేపటతామని ప్రసాద్ అన్నారు. త్వరలో ప్రతి గోదాములో సిసి కెమెరా లను అమర్చుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు కె.విజయ భాస్కర్, పి. కృష్ణ కుమార్, కె.రఘురామి రెడ్డి, ఎమ్.ఎ. రషీద్, ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి డి. చంద్రశేఖర్, సంస్థ సిబ్భంది పాల్గొన్నారు.













