ఏపీ ప్రభుత్వానికి మరో షాక్… ఈ నెల 6 నుంచి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగలనుంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలైన ఎన్ఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూ ఎఫ్, కార్మిక పరిషత్ సంఘాల నేతలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 6 నుంచి సమ్మెల్లోకి వెళ్తామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ మేరకు 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకీ కార్మిక సంఘాల నేతలు అందించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై పంచాయితీ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు.













