ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధ
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌సవాంగ్‌ను నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అనురాధను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.













