కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యపడుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘువీరారెడ్డి టెక్కలిలో నిర్వహించిన పార్టీ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే చేస్తానని ఇప్పటికే పలుమార్లు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ప్రకటించారని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే ఈ జిల్లాతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని సృష్టం చేశారు.













