దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ..
ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండిస్తున్నామని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై 40 వేల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఉద్యోగస్థులు ప్రాణ త్యాగానికి సిద్దంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఏప్రిల్ నెలలో పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా మూడు డీఏలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.













