వీర జవాన్ల కుటుంబాలకు ఎన్జీవో రూ.30 కోట్ల ఆర్థిక సాయం
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరూ రూ.500 చొప్పున మొత్తం రూ.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ఎన్జీవోలు. రూ.30 కోట్ల ఆర్థిక సహాయం చెక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందించిన ఎన్జీవో సంఘాల ప్రతినిధులు.
కష్ట సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు చూపిన ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
వీర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఒక్కొక్క జవాన్ కుటుంబానికి ఇప్పటికే రూ.5 లక్షల సాయం ప్రకటించామని, ఇప్పుడు ఉద్యోగులు, ఇతరులు ప్రకటించిన సాయాన్ని కూడా కలిపి ఆయా కుటుంబాలకు అందజేస్తామని తెలిపిన సీయం చంద్రబాబు. పుల్వామా వీర జవాన్ల కుటుంబానికి మైలవరం వివేకానంద హైస్కూల్ యాజమాన్యం రూ.లక్ష, తణుకు ప్రగతి జూనియర్ కళాశాల యాజమాన్యం రూ.1.05 లక్షలు చొప్పున ముఖ్యమంత్రికి చెక్‌ల అందజేత.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల తరపున శ్రీకాకుళంలో రూ.25 లక్షల సాయం అందించామని తెలిపిన అప్సా ప్రతినిధులు.













