ఐఏఎస్, ఐపీఎస్ కలిసి.. ఆదర్శంగా నిలిచి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జేసీ అపరాజిత సింగ్ సిన్వర్ నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన జేసీ అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి దేవేంద్ర కుమార్‌ను కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ సమక్షంలో వివాహమాడారు. ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇద్దరి మనుసులు కలవగా పెద్దల అంగీకారంతో ఒక్కటవాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జేసీ అపరాజిత పుట్టినరోజు కావడంతో ఇదే రోజు వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆడంబరాలు లేకుండా కార్యాలయ సిబ్బంది సమక్షంలో దండలు మార్చుకున్నారు.













