కార్మికుల సమస్యలు పరిష్కారం : మేడపాటి వెంకట్
బహ్రెయిన్ లోని బాధిత కార్మికులు, నాజర్ ఎస్ అల్ హర్జేరి కో ఆపరేషన్ (ఎన్హెచ్ఎస్) సంస్థ యాజమాన్యంతో అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు ఫలించాయని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సంస్థ అంగీకరించిందిన ఆంధ్రప్రదేశ్ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు. స్వస్థలాలకు వెళ్లిపోతామన్న కార్మికులకు విమాన టికెట్లను మంజూరు చేసేందుకు సంస్థ అంగీకరించిందని తెలిపారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయ అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో ఉంచారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.













