జనసేన అధినేత పవన్ కు.. మహిళా కమిషన్ నోటీసులు
మూడు వివాహాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ వ్యాఖ్యలున్నాయని పేర్కొంది. ఈ వేరకు మూడు వివాహాలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కమిటీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ మేరకు పవన్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా లోకానికి పవన్ క్షమాపణ చెప్పాలి. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడడం సరైంది కాదు. పవన్ మాటాలు మహిళా భద్రతకు పెనుప్రమాదంగా మారతాయి అని అన్నారు.













