Palla Srinivasa Rao:ఈ అంశంపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తాం : పల్లా
తిరుమల లడ్డూ (Tirumala Laddu) నెయ్యి కల్తీపై ప్రతి హిందువు బాధపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) చెప్పారు. మాజీ సీఎం జగన్ (Jagan) మాత్రం, అసలు కల్తీనే జరగలేదంటారు. రసాయనాలతో నెయ్యి తయారు చేశారు. డబ్బుకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను తాకట్టుపెట్టారు. ఈ వ్యవహారంలో జగన్ను బాధ్యుడిగా చేయాలి. నెయ్యి కల్తీ కేసులో అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవు. ఈ అంశంపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తాం అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













