అమెరికా ప్రముఖులతో ఏపీ విద్యార్థి మాటమంతీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. విదేశీ విద్యకు జగనన్న చేస్తున్న సాయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖులకు వివరించాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన గ్రామీణ ప్రాంత యువకుడు ఆ దేశ ప్రముఖులను కలిసి తన విద్యాభిరుచిని తెలియజపర్చారు. మోపిదేవి మండలంలోని అడపావారిపాలెం పీఏసీఎస్ చైర్పర్సన్ పండలనేని అన్నపూర్ణ, శివప్రసాద్ కుమారుడు కృష్ణ కిషోర్‌కు విదేశీ విద్యకు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కోటి రూపాయలు మంజూరు చేశారు.
ఉన్నత చదువుల నిమిత్తం ఇటీవల అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్లిన కృష్ణ కిషోర్ తాను చదువుతున్న యూనివర్సిటీకి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్, యూనిసెఫ్, యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రైటాను కలుసుకున్నారు. పేద విద్యార్థులకు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అందిస్తున్న సీఎం జగనన్నకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందన్నారు. తనకు సహకరించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుకు ప్రత్యేక కృతజ్జతలు తెలిపారు.













