మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా… చట్టం తన పని తాను
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకపోయిన చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా జరుగుతాయని అయన్న స్పష్టం చేశారు. మంగళవారం బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.













